HomeఆటAsian Games: రికార్డు సృష్టించిన కుంకుమ్.. తొలి భారత మహిళగా ఘనత..

Asian Games: రికార్డు సృష్టించిన కుంకుమ్.. తొలి భారత మహిళగా ఘనత..

నాగోయా అక్టోబర్ 3 (తెలుగు ప్రభ): భారత యువ ఆర్చర్ కుంకుమ్ మొహోద్ ఘన విజయం నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించింది. ఈ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత మహిళగా కుంకుమ్ నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన కుంకుమ్.. కీలక మ్యాచ్‌లోనూ జోరును కొనసాగించింది. ఉత్కంఠభరితంగా సాగిన తుది సమరంలో కొరియాకు చెందిన యుజెన్‌ను చిత్తు చేసింది. కీలకమైన షూటౌట్‌లో ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా 10 పాయింట్ల షాట్‌తో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

ఈ ఘన విజయంతో మరో అరుదైన అవకాశాన్ని కుంకుమ్ మొహోద్ చేజిక్కించుకుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్‌కు వ్యక్తిగత కోటా స్థానాన్ని సాధించింది. ఈ మేరకు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో పాటు ఒలింపిక్స్‌కు కోటా స్థానం సాధించిన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. ఈ విజయంతో కుంకుమ్ ఆసియా క్రీడల్లో తన పతకాల సంఖ్యను మూడుకు పెంచుకోగా.. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషంగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News