Sunday, July 7, 2024
HomeఆటKurnool: వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు కలెక్టర్ అభినందన

Kurnool: వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు కలెక్టర్ అభినందన

కర్నూలు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు 9 మెడల్స్

కర్నూలు జిల్లా నుండి వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అభినందించారు. నగరంలోని ఔట్ డోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 17 నుండి 19 వరకు నిర్వహించిన 10 వ ఏ.పి.స్టేట్ సీనియర్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ క్రీడల పోటీల్లో జిల్లా నుండి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు 9 మెడల్స్ ను సాధించారు.

- Advertisement -

ఈ సందర్భంగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు బి. వీరేష్, డి జి. వీరేష్, అబ్దుల్లా, నరసింహ నాయక్, పర్వేజ్ ముషారఫ్, బి.నాగమణి లను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సెట్కుర్ సీఈవో రమణ, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, కోచ్ యూసుఫ్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News