Sunday, July 7, 2024
HomeఆటKurnool: ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనోడు

Kurnool: ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనోడు

గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలోని ఎస్సీ కాలనీకి చెందిన కర్రెన్న సువర్ణమ్మలకు ముగ్గురు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు సురేష్ బాబు. నిరుపేద కుటుంబంలో పుట్టి న సురేష్ బాబు చదువుకుంటూనే గుట్టలు కొండలు ఎక్కడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాను చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 2016 నవంబర్ 14న ఎం.టి రినోక్ పర్వతము 14 వేల అడుగులను అధిరోహించాడు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తాను చదువుతున్న సిల్వర్ జూబ్లీ కాలేజ్ లెక్చరర్లు, పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా లెక్చరర్ డాక్టర్ జగన్ సహకారంతో ఎవరెస్టు శిఖరం,కిల్మంజారో శిఖరం వంటి 25 ఎత్తైన పర్వతాలను ఎక్కి భారతదేశం గర్వించేలా రికార్డులు సృష్టించాడు. ఇప్పటి వరకు ఐదు ఖండాలలోని అనేక పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించాడు. ఇలా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన తొలి భారతీయ పర్వతారోహకుడిగా సురేష్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐదు సంవత్సరాల వ్యవధిలో 19 పర్వతాలను పూర్తి చేసిన ఏకైక పర్వతారోహకుడు. పర్వతారోహకుడు సురేష్ బాబు గూర్చి తెలుసుకున్న కర్నూలు మెంబర్ అఫ్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మండల ఎంపీపీ నసురుద్దీన్ లు శనివారం పర్వతాది రోహకుడు సురేష్ బాబు గృహాన్ని సందర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News