Monday, July 8, 2024
HomeఆటKurnool: రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన

Kurnool: రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన

జిల్లా ఉషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ


ఆగస్టు 27 28 తేదీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారులు 12 ఓల్డ్ మెడల్ 4 సిల్వర్ 16 పథకాలు సాధించారు. ఈ సందర్భంగా పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అభినందన కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉషూ సంఘం
చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ విచ్చేసి మాట్లాడుతూ ..చిన్నారులు చదువుతో పాటు కరాటే ఉషూ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆరోగ్యం, ఆత్మరక్షణ కోసం పనికొస్తుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలో పథకాలు సాధించినందుకు క్రీడాకారులకు అభినందిస్తూ ఇలాగే రోజు క్రీడాకారులు సాధన చేయాలన్నారు. ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్లను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ బాలికల పాఠశాల హెడ్మాస్టర్ మౌలాలి మాస్టర్లు క్రాంతి పాల్గొన్నారు అని మాస్టర్ టి శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News