Marnus Labuschagne : ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతడి ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. తాజాగా టెస్టుల్లో అత్యంత వేగంగా 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ ఎనర్టన్ వీక్స్ సరసన నిలిచాడు.
ఇందుకోసం 51 ఇన్సింగ్స్‌లు అవసరం అయ్యాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన లబుషేన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ జాబితా తొలి స్థానంలో ఆల్‌టైం గ్రేమ్, ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్ ఉన్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 33 ఇన్నింగ్స్‌లోనే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లబుషేన్‌తో పాటు ట్రావిస్ హెడ్ 175 పరుగులతో రాణించడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 511/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్, థామస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, హోల్డర్, బ్రాత్‌వైట్ ఒక్కొ వికెట్ తీశారు. ఇక రెండో ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. విండీస్ దిగ్గజం శివనరేన్ చంద్రపాల్ కుమారుడు టాగెనరైన్ చంద్రపాల్ 47 పరుగులతో, ఆండర్సన్ ఫిలిప్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఇంకా 409 పరుగులు వెనుకబడి ఉంది.