లక్షేటిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ జెండా వెంకటాపూర్ పాఠశాలలో బుధవారం పర్మనెంట్ వాలీబాల్ కోర్టును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.యశోదర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా మానసిక వికాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయని, క్రీడలలో గెలుపోటలు సహజమని అన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/bcba83c4-9b9c-4321-9609-26c5dae3efd2-1024x577.jpg)
ఏటా స్కాలర్షిప్ కూడా
అనంతరం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దుర్గం వర్షిత్ అనే విద్యార్థికి నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ సాధించిందని, గత ఏడు సంవత్సరాలలో ఆరు సార్లు ఎన్ఎంఎంఎస్ సాధించడం విశేషమన్నారు. ఇలా క్రీడల్లో దూసుకుపోతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయల నగదును ఐదు సంవత్సరాలు అందజేస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు పార్వతి శ్రీనివాస్, మా పాఠశాల ఉపాధ్యాయులు స్లీవయ్య, జ్యోతిర్మయి, వాణిశ్రీ, దుర్గ ప్రసాద్, రమేష్, సతీష్, రవీందర్, పిఈటి బెల్లం శ్రీనివాస్ వంశీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.