ICC ODI: ఐసీసీ (ICC) బుధవారం వన్డే ర్యాకింగ్స్ ప్రకటించింది. అయితే, ఈ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీల (Virat Kohli) స్థానాలు గల్లంతయ్యాయి! దీంతో, క్రికెట్ లవర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, రోహిత్, కోహ్లీ..వీరిద్దరూ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు తమ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే గతవారం (ఆగస్టు 13) ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో 756 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానం, 736 పాయింట్లతో విరాట్ కోహ్లీ నాలుగోస్థానంలో నిలిచారు. కాగా ప్రస్తుతం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 784 పాయింట్లతో ఇప్పటికీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 739 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఈ ర్యాంకింగ్స్‌లో అసలు స్థానం దక్కలేదు. కారణాలేంటో స్పష్టంగా తెలియకపోయినా.. ఏదైనా సాంకేతిక లోపంతో ఇలా జరిగి ఉండవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ చివరగా తమ వన్డే మ్యాచ్‌ను యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) సందర్భంగా ఆడారు. ప్రస్తుతం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్- 10లో టీమ్ఇండియా నుంచి ఇద్దరు మాత్రమే చోటు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాత్రమే స్థానం దక్కించుకున్నారు.
Read Also: CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్..!
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ఆగస్టు 20)
- శుభ్‌మన్ గిల్ – భారత్ – 784 పాయింట్లు.
- బాబర్ అజామ్ – పాకిస్థాన్ – 739 పాయింట్లు.
- డారిల్ మిచెల్ – న్యూజిలాండ్ -720 పాయింట్లు.
- చరిత్ అసలంక- శ్రీలంక- 719 పాయింట్లు.
- హ్యారీ టెక్టర్ – ఐర్లాండ్- 708 పాయింట్లు.
- శ్రేయస్ అయ్యర్ – భారత్ – 704 పాయింట్లు.
- షాయ్ హోప్- వెస్టిండీస్- 699 పాయింట్లు.
- ఇబ్రహీం జద్రాన్- అఫ్గానిస్థాన్- 676 పాయింట్లు.
- కుశాల్ మెండిస్- శ్రీలంక- 669 పాయింట్లు.
- ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- 648 పాయింట్లు.
Read Also: Amit Shah: వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే పదవి కోల్పోయినట్టే..!
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్(ఆగస్టు 13)
- శుభ్‌మన్ గిల్ – భారత్ – 784 పాయింట్లు.
- రోహిత్ శర్మ- భారత్- 756 పాయింట్లు.
- బాబర్ అజామ్ – పాకిస్థాన్- 751 పాయింట్లు.
- విరాట్ కోహ్లీ- భారత్- 736 పాయింట్లు.
- డారిల్ మిచెల్ – న్యూజిలాండ్- 720 పాయింట్లు.
- చరిత్ అసలంక- శ్రీలంక- 719 పాయింట్లు.
- హ్యారీ టెక్టర్ – ఐర్లాండ్- 708 పాయింట్లు.
- శ్రేయస్ అయ్యర్- భారత్- 704 పాయింట్లు.
- ఇబ్రహీం జద్రాన్- అఫ్గానిస్థాన్- 676 పాయింట్లు.
- కుశాల్ మెండిస్- శ్రీలంక- 669 పాయింట్లు.


