Saturday, November 15, 2025
HomeఆటGOAT 2025: భారత్ కి రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ..!

GOAT 2025: భారత్ కి రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ..!

Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, వరల్డ్‌ కప్ విజేత లియోనెల్ మెస్సీ  భారతదేశానికి రానున్నాడు. ఈ ఏడాది డిసెంబరులో మెస్సీ పర్యటన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సుదీర్ఘ విరామం అనంతరం, మెస్సీ భారత్‌కు రానుండటంతో భారత ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది.

- Advertisement -

GOAT(Greatest of All Time) టూర్ ఆఫ్ ఇండియా 2025 కార్యక్రమం డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 15 వరకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జరుగనుంది. డిసెంబర్ 12న మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటారు. డిసెంబర్ 13న కోల్‌కతాలో కార్యక్రమాల అనంతరం అదే రోజు సాయంత్రం అహ్మదాబాద్‌కు వెళతారు. డిసెంబర్ 14న ముంబయి, డిసెంబర్ 15న న్యూఢిల్లీలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

Read more: https://teluguprabha.net/sports-news/australia-cricket-legend-bob-simpson-dies-at-age-89/

డిసెంబర్ 12న మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటాడు. మరుసటి రోజు ఉదయం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఈడెన్ గార్డెన్స్ లేదా సాల్ట్ లేక్ స్టేడియంలో స్నేహపూర్వక మ్యాచ్ అయిన GOAT కన్సర్ట్ మరియు GOAT కప్ లో మెస్సీ పాల్గొంటారు. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సౌరవ్ గంగూలీ, లియాండర్ పేస్, జాన్ అబ్రహం మరియు భైచుంగ్ భూటియా పాల్గొంటారని భావిస్తున్నారు.

దుర్గాపూజ వేడుకల్లో ఏర్పాటు చేసిన 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్న గొప్ప మ్యూరల్ కూడా ఆవిష్కరించబడుతుంది. అభిమానులు అందులో చిత్రాలు గీసి సందేశాలు వ్రాయవచ్చు. అనంతరం, ఈ మ్యూరల్‌ను మెస్సీకి బహుమతిగా అందిస్తారు. డిసెంబర్ 13న సాయంత్రం అహ్మదాబాద్‌ లో అదాని ఫౌండేషన్ నిర్వహించే ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొంటారు.

Read more: https://teluguprabha.net/sports-news/droupadi-murmu-on-india-s-women-chess-champions/

డిసెంబర్ 14న మెస్సీ ముంబయి చేరుకొని సీసీఐ బ్రాబోర్న్‌లో అభిమానులతో మీట్ అండ్ గ్రీట్, వాంఖడే స్టేడియంలో GOAT కప్ & కన్‌సర్ట్, సెలబ్రిటీ ప్యాడెల్ మ్యాచ్ లలో పాల్గొంటారు. అనంతరం క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్, అమీర్ ఖాన్, టైగర్ ష్రాఫ్ లతో మెస్సీ కలవనున్నారు.

డిసెంబర్ 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంతో GOAT పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో చివరి GOAT కన్సర్ట్ మరియు GOAT కప్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad