Sunday, July 7, 2024
HomeఆటLionel Messi: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మెస్సీ.. అత్యధిక లైక్స్ దక్కించుకున్న పోస్ట్

Lionel Messi: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మెస్సీ.. అత్యధిక లైక్స్ దక్కించుకున్న పోస్ట్

Lionel Messi: ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ హీరో, లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అయితే, ఇది ఫుట్‌బాల్‌కు సంబంధించి కాదు. సోషల్ మీడియాలో. అవును.. ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

- Advertisement -

ప్రపంచ కప్ ట్రోఫీతో మెస్సీ చేసిన పోస్ట్‌కు అత్యధిక లైక్స్ వచ్చాయి. మెస్సీ తన అధికారిక అకౌంట్‌లో చేసిన పోస్ట్‌కు ఇప్పటివరకు 45.8 మిలియన్ల లైక్స్ నమోదయ్యాయి. పోస్ట్ చేసిన 18 గంటల్లోనే మెస్సీ ఈ ఘనత దక్కించుకోవడం విశేషం. ఈ కౌంట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ‘ఛాంపియన్స్ ఆఫ్ ద వరల్డ్’ పేరిట మెస్సీ ఈ పోస్ట్ చేశాడు. మెస్సీ ఇన్‌స్టాలో సాధించిన ఈ రికార్డు అంతకుముందు ఉన్న మరో ఫుట్‌బాల్‌ ఆటగాడి రికార్డును బ్రేక్ చేసింది.

ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ రికార్డ్ పోర్చుగల్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉంది. అందులోనూ మెస్సీ ఉండటం మరో విశేషం. ఇద్దరూ కలిసి చెస్ ఆడుతున్న ఫొటోకు 41.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ‘ఫిఫా వరల్డ్ కప్-2022’లో మెస్సీ తన జట్టును విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటినా విజయం సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News