Saturday, November 15, 2025
HomeఆటSRH vs LSG: పూరన్ పూనకాలు.. SRHపై లక్నో ఘన విజయం..!

SRH vs LSG: పూరన్ పూనకాలు.. SRHపై లక్నో ఘన విజయం..!

లక్నో సూపర్ జెయింట్స్‌ హైదరాబాద్‌ను ఓడించి ఘన విజయాన్ని సాధించింది. లక్ష్య చేధనలో నికోలస్ పూరన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 191 పరుగుల లక్ష్యాన్ని లక్నో కేవలం 16 ఓవర్లలోనే ఛేదించింది. పూరన్ 22 బంతుల్లోనే 70 పరుగులు చేయగా, అతనికి మిచెల్ మార్ష్ (52) తోడుగా నిలిచాడు. చివర్లో అబ్దుల్ సమద్ కూడా చక్కటి ఫినిషింగ్ ఇచ్చాడు.

- Advertisement -

ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (47) మరోసారి మెరుపులు మెరిపించాడు. కానీ అభిషేక్ శర్మ (6) విఫలమయ్యాడు. మిడిలార్డర్‌లో అనికేత్ వర్మ (36) చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, నితీష్ రెడ్డి (32) మరియు హెన్రిచ్ క్లాసెన్ (26) మాదిరిగా రాణించారు. చివర్లో పాట్ కమిన్స్ (18) వరుసగా మూడు సిక్సులు బాదడంతో స్కోరు 190కి చేరింది. అయితే, మొదటి మ్యాచ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ ఈసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

లక్నో ఛేదన ఆరంభంలో మార్క్ రమ్ వికెట్ కోల్పోయినా, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ విజృంభించారు. మిడిల్ ఓవర్లలోనే భారీ షాట్లతో స్కోర్‌ను పరుగుల ప్రవాహంగా మార్చారు. పూరన్ 6 ఫోర్లు, 6 సిక్సులతో విరుచుకుపడ్డాడు. చివరికి లక్నో 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకొని ఘన విజయం సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad