Wednesday, April 16, 2025
HomeఆటIPL 2025: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో లక్నో విజయం.. 4 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్..!

IPL 2025: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో లక్నో విజయం.. 4 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్..!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్‌లో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా చివరి వరకు పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.

- Advertisement -

ఈ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మెరుపులు మెరిపించింది. టాప్ ఆర్డర్ రాణించడంతో 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వికెట్లకు మధ్య చక్కటి భాగస్వామ్యాలు, భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లపై ఒత్తిడి తేవడంలో లక్నో ఆటగాళ్లు విజయవంతమయ్యారు.

ఆ తరువాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా ప్రారంభంలోనే దూకుడుగా ఆడింది. రహానె (61), వెంకటేశ్ అయ్యర్ (45) మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మిడ్‌ల ఆర్డర్ లో కొన్ని వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ, ఆఖరి వరకు పోరాడిన రింకూ సింగ్‌ చివరి ఓవర్ లో 14 పరుగులు చేసినా విజయం అందుకోలేకపోయాడు. చివరికి కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగుల వద్దే నిలిచింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ తలో రెండు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలర్ల కంటే బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చూపిన ఈ మ్యాచ్ లో మైదానంలో అభిమానులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించారు.

ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది మూడో ఓటమి. 5 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ అనంతరం రెండు జట్ల మధ్య పాయింట్ల తేడా తగ్గినప్పటికీ.. ప్లేఆఫ్ బెర్త్ కోసం భవిష్యత్ తదుపరి మ్యాచులు కీలకంగా మారనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News