ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడతడు అతి చిన్న వయసులోనే బ్లాక్ బెల్ట్ సాధించి వావ్ అనిపించాడు. మదనపల్లెకు చెందిన మురళి మెడికల్స్ అధినేత మురళి మనవడు అతి చిన్న వయస్సు 6 సంవత్సరాలకే కరాటే ఛాంపియన్ గా నిలిచాడు.
కలామ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో
డి.ఏ. హేమాంష్ అనే ఈ 6 ఏళ్ల పిల్లాడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కలామ్స్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించాడు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతులమీదుగా హేమాంష్ కు ప్రసంశ పత్రం, మెడల్, మూమెంటో అందజేశారు. హేమాంష్ సాధన కేవలం కరాటేకు సంబంధించి మాత్రమే కాదు, చిన్న వయస్సులో కఠినమైన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఉన్న యువతకు ప్రేరణ అవుతుంది.
ట్రైన్ చేసిన కరాటే గ్రాండ్ మాస్టర్
కరాటే గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏ.ఆర్. సురేష్ శిక్షణలో హేమాంష్ కృషిని, ప్రతిభను ప్రశంసిస్తూ, ఆయన సాధించిన విజయాన్ని వివరించారు. ఈ సాహసం హేమాంష్ కష్టపడి సాధించిన విజయాన్ని మాత్రమే కాదు, యువతకు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పట్టుదల ప్రయత్నం గురించి ఆలోచించడానికి ఒక ఉత్తమ ప్రేరణగా నిలుస్తుందని ఎంఎల్ఏ షాజహాన్ బాషా హేమాంష్ ను అభినందించారు.