Saturday, July 12, 2025
HomeఆటMLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు

Major League Cricket 2025: యూఎస్ వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ అభిమానులను అలరిస్తోంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతుండంటంతో ప్రేక్షకుల ఆదరణ అదిరిపోయింది. జూన్ 13న ప్రారంభమైన ఈ లీగ్ నాకౌట్ దశకు చేరుకుంది. ఆరు జట్లలో నాలుగు జట్లు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారుచేసుకోగా.. రెండు జట్లు ఇంటిదారి పట్టాయి. ప్లేఆఫ్స్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 16 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. 14 పాయింట్లతో టెక్సాస్ సూపర్ కింగ్స్ రెండో స్థానం.. సేమ్ 14 పాయింట్లు సాధించిన శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ నెట్ రన్ రేట్‌లో వెనకబడి మూడో ప్లేస్‌ దక్కించుకున్నాయి. 6 పాయింట్లతో ఎంఐ న్యూయార్క్ నాలుగో స్థానం పొందింది.

- Advertisement -

దీంతో ఈ నాలుగు జట్లలో రెండు జట్లు ఫైనల్‌లకు అర్హత సాధించనున్నాయి. జులై 9న వాషింగ్టన్ ఫ్రీడమ్ – టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈనెల 10న శాన్‌ ఫ్రాన్సిస్కో – ఎంఐ న్యూయార్క్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. జులై 12న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఉండనుంది. ఇక జులై 14న లీగ్ ఫైనల్ జరుగుతుంది.

మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో ఒక్కొక్కటి పది మ్యాచ్‌లు ఆడాయి. లీగ్ దశలో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. ఈ లీగ్‌లో ఐపీఎల్‌లో ఆడిన ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఆడటంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ ఆరు జట్లలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు చెందిన నాలుగు జట్లు ఉండటం విశేషం. టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటల్ ఆర్కస్ జట్లు ఈ లీగ్‌లో పాల్గొన్నాయి.

Also Read: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో భారీ విజయం

ఈ జట్లలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలైన చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌కి చెందిన ఎంఐ న్యూయార్క్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన సియాటల్ ఆర్కస్ ఉన్నాయి. మిగిలిన రెండు జట్లు వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలకు చెందినవి.

ఇక టెక్సాస్ సూపర్ కింగ్స్‌ సారథిగా ఫాఫ్ డుప్లెసిస్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ కెప్టెన్‌గా జేసన్ హోల్డర్, ఎంఐ న్యూయార్క్‌ కెప్టెన్‌గా నికోలస్ పూరన్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ సారథిగా కోరి అండర్సన్, సియాటల్ ఆర్కస్ కెప్టెన్‌గాహెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ ఫ్రీడమ్‌ జట్టుకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ లీగ్ మ్యాచ్‌లను భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్షప్రసారం చూడొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News