డ్రాగన్ షోటో ఖాన్ కరాటే డు స్పోర్ట్స్ మక్తల్ విద్యార్థులు కర్ణాటక రాష్ట్రంలోని దావనగిరిలో నేషనల్ లెవెల్ కరాటే టోర్నమెంట్ లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించినట్టు కరాటే వ్యవస్థాపకులు
డ్రాగన్ షోటోకన్ కరాటే డు స్పోర్ట్స్ స్టైల్ చీఫ్ సలాంబిన్ ఉమర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుమతి విభాగంలో-బంగారు పథకాలు సాధించిన దీక్షిత, నిహాల్, మాయా, అక్షయ్, అక్షయ, అదేవిధంగా కటామి విభాగములో-వెండి పథకాలు సాధించిన నాగేశ్వరి, అక్షయ, కన్నయ్యలు వెండి పతకాలు సాధించారని వీరిని సర్టిఫికెట్, కప్పులను ఇచ్చి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జామినర్ సి. అంబ్రేష్, వైస్ప్రెసిడెంట్ కె . అంజన్ ప్రసాద్, ఊషు సెక్రటరీ టోర్నమెంట్ ఇంచార్జ్ మొహమ్మద్ సలీం, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.