గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్, పాల్వాయి గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌లను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ్మ ప్రారంభించారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడ నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి, గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయివరకు మీ ప్రదర్శనలు తీయాలని, భవిష్యత్తులో అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగి గద్వాల ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే, ఓడిపోయినా నిరుత్సాహ పడకూడదు, గెలిచాము అని గర్వపడవద్దు స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలి ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరవాయి కృష్ణారెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,పెదొడ్డి రామకృష్ణ, పులిపాటి వెంకటేష్, జగదీష్, ఎల్కూర్ నర్సింహులు, తిమ్మప్ప, కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్, ఇలియాస్, ఏసు, మాజీ సర్పంచ్ దాసన్న, అయ్యప్ప, హైదర్సాబ్, అజార్, మధు, విజయ్, వెంకటేష్, వినోద్, రాము, రాజేష్, నర్సింహులు, జగదీష్, రవి తదితరులు ఉన్నారు.