Saturday, November 15, 2025
HomeఆటMallapur: యువత క్రీడల్లో రాణించాలి

Mallapur: యువత క్రీడల్లో రాణించాలి

మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి

పోలీసు అమరవీరుల దినోత్సవం సంధర్భంగా వారి స్మారకార్థం మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని మల్లాపూర్, మెట్ పల్లి, ఇబ్రహీం పట్నం మండలాల వాలీబాల్ టోర్నమెంట్ ని మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో సీఐ నిరంజన్ రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. మొత్తం 8 జట్లు పాల్గొనగా మెట్ పల్లి విజేతగా, వాల్గొండ రన్నరప్ గా నిలిచాయి.

- Advertisement -

విజేతలకు డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు బహుమతులు, నగదు అందజేశారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు పోకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని క్రీడల్లో రాణించి ఉన్నత స్థానం పొందాలని, ఓడిపోయిన జట్లు కుంగిపోవద్దని, విజయం కోసం కష్టపడాలని జిల్లా స్థాయి పోటీల్లో మన జట్టు విజయం సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎస్సైలు చిరంజీవి, కిరణ్ కుమార్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad