Thursday, September 19, 2024
HomeఆటMayank Agarwal : తండ్రైన టీమ్ఇండియా క్రికెటర్‌

Mayank Agarwal : తండ్రైన టీమ్ఇండియా క్రికెటర్‌

Mayank Agarwal : భార‌త క్రికెట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ తండ్రైయ్యాడు. అత‌డి భార్య అషితా సూద్ గురువారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని మ‌యాంక్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. మ‌యాంక్, అషితా దంప‌తులు త‌మ కుమారుడిని ఎత్తుకున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. త‌మ కుమారుడికి ఆయాన్ష్ అని పేరు పెట్టిన‌ట్లు చెప్పారు.

- Advertisement -

అషితాసూద్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన మ‌యాంక్ అగ‌ర్వాల్ 2018 జ‌న‌వ‌రి నెల‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది జూన్ 4న వివాహా బంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లైన‌ నాలుగు సంవత్సరాలకు త‌మ మొద‌టి బిడ్డ‌కు వారు స్వాగ‌తం ప‌లికారు. “హృద‌యం నిండా ఉప్పొంగుతున్న సంతోషంతో మేము ఆయాన్ష్‌ని ప‌రిచ‌యం చేస్తున్నాం. మా జీవితాల్లో తొలి వెలుగు అత‌డే. దేవుడు ఇచ్చిన గొప్ప బ‌హుమ‌తి” అంటూ మ‌యాంక్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

భార‌త టెస్టు జ‌ట్టులో మ‌యాంక్ అగ‌ర్వాల్ రెగ్యుల‌ర్ స‌భ్యుడు. ఇప్ప‌టి వ‌ర‌కు 21 టెస్టుల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. రెండు ద్విశ‌త‌కాలు, నాలుగు శ‌త‌కాలు, ఆరు అర్థ‌శ‌త‌కాలు బాది 1,488 ప‌రుగులు చేశాడు. టెస్టుల్లో రాణిస్తున్న‌ప్ప‌టికీ వ‌న్డేల్లో మాత్రం చోటు ద‌క్కంచుకోలేక‌పోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 5 వ‌న్డేలు మాత్ర‌మే ఆడి 86 ప‌రుగులు చేశాడు. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో మాత్రం అద‌ర‌గొట్టాడు. 113 మ్యాచ్‌ల్లో 2,331 ప‌రుగులు చేశాడు. ఓ శ‌త‌కం కూడా బాదాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News