గెలుపోటములు సహజం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనీ, అలాగే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మండల కేంద్రమైన గోనెగండ్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కీర్తిశేషులు పెద్ద రంగస్వామి స్మారక 70వ రాష్ట్రస్థాయి మహిళ కబడ్డీ లీగ్ అండ్ నాకౌట్ పోటీలను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు పెద్ద రంగస్వామి స్మారక రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు గోనెగండ్ల లో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళా కబడ్డీ క్రీడాకారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయని అన్నారు. అలాగే ఈ మహిళ రాష్ట్రస్థాయి కబడ్డీ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ జాతీయస్థాయిలో కబడ్డీ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కల్పించి ప్రోత్సహించాలని అన్నారు.క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలుపోటములు సహజమని,వాటిని సమానంగా స్వీకరించాలని అన్నారు. ముందుగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని ఆర్గనైజర్లు కుబేర నాయుడు, జాకీర్ హుస్సేన్ లు పూల మాలలతో సత్కరించారు.అనంతరం సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
గోనెగండ్ల కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయం విద్యార్థినిలు, మహిళా కబడ్డీ క్రీడాకారిణులు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్గనైజర్ల మాట్లాడుతూ ఈ రాష్ట్రస్థాయి మహిళ కబడ్డీ పోటీలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, అబ్జర్వర్ శ్రీధర్, ట్రెజరరీ సుబ్బరాజు, కీర్తిశేషులు పెద్ద రంగస్వామి గారి కుమారులు రఘు, రంగరాజు లు, మండల తహసిల్దార్ వేణుగోపాల్, నాయకులు ఎంపీపీ నసురుద్దీన్, యూత్ మండల అధ్యక్షులు బందే నవాజ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్, వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి , ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామన్, ఇస్మాయిల్, వలి తదితరులు పాల్గొన్నారు.