టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ జాకిర్ వికెట్ తీసి తన ఖాతాలో బిగ్ రికార్డును వేసుకున్నాడు షమీ. వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ అయ్యాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ మొత్తం 5126 బంతులు వేసి 200వ వికెట్ వేసుకున్నాడు. అయితే ఆసీస్ బౌలర్ స్టార్క్ 200 వికెట్లు తీసుకోవడానికి 5240 బంతులు వేయాల్సి వచ్చింది. కానీ అతి తక్కువ మ్యాచుల్లో స్టార్క్ ఆ రికార్డును అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో జాకీర్ అలీని క్యాచ్ ఔట్ చేయడంతో మహమ్మద్ షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 104 వన్డేల్లో మహమ్మద్ షమీ 200 వికెట్లను తీయగా.. మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్(107 మ్యాచ్‌లు), బ్రెట్‌లీ(112), అలన్ డోనాల్డ్(117) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బంతుల పరంగా మాత్రం మహమ్మద్ షమీనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.
వైట్‌బాల్ టోర్నీల్లో మహమ్మద్ షమీ 72 వికెట్లతో టాప్ ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్ రికార్డ్‌ను అధిగమించాడు. 18 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీసిన షమీ.. 14 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న షమీ 3 వికెట్లు తీసి మొత్తం 33 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా (68 వికెట్లు), రవీంద్ర జడేజా(65), రవిచంద్రన్ అశ్విన్(59) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.