England Test Series: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రతిభని కనబరిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఏకంగా 31కి.మీ లకు పైగా దూరం పరిగెత్తాడు. ఇది హాఫ్ మారథాన్ కంటే ఎక్కువ దూరం. బౌలింగ్ చేస్తూ ఇంత దూరం పరిగెట్టడం అనేది ఓ రికార్డుని నెలకొల్పడమే అవుతుంది.
ఇంగ్లాండ్ తో జరిగిన ఈ సిరీస్ లో సిరాజ్ మొత్తం 1027 బంతులు వేశారు. ఒక బౌలర్ ఒక్క బాల్ వేయడానికి 28 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే 1027 బంతులు వేయడానికి సిరాజ్ మొత్తం 31 కి.మీ కంటే ఎక్కువ దూరం పరిగెత్తాడు. ఒలంపిక్స్ లో జరిగే హాఫ్ మారథాన్ లో 21కి.మీ పరిగెత్తాలి. దీంతో చూసుకుంటే సిరాజ్ కేవలం బౌలింగ్ వేయడానికే హాఫ్ మారథాన్ కంటే 10కి.మీ. అదనంగా పరిగెత్తాడు.
Read more: https://teluguprabha.net/sports-news/andhra-premier-league-2025-first-day-celebrations/
బ్యాటింగ్, ఫీల్డింగ్ కోసం పరిగెత్తిన దూరాన్ని కూడా కలిపితే మొత్తం దూరం ఇంకా పెరుగుతుంది. టెస్ట్ సిరీస్ లో ఒక స్పీడ్ బౌలర్ కి 1000 బంతులు వేయడమే ఒక సవాల్ అయితే సిరాజ్ తన ఫిట్ నెస్ తో 1000కి పైగా బంతులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రతి మ్యాచ్ లో పూర్తి ఫిట్ నెస్ తో బరిలోకి దిగి అత్యధికంగా 23 వికెట్లు సాధించాడు.
పిచ్ కండిషన్లు, వాతావరణ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా పూర్తి నిబద్దతతో భారత్ విజయం సాధించేలా మొహమ్మద్ సిరాజ్ కృషి చేసాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సిరాజ్ ప్రతిభని ప్రశంసించాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఈ స్థాయిలో బౌలింగ్ చేయడం తేలిక కాదు. సిరాజ్ అయితే ప్రతీ స్పెల్‌లో ఆగ్రెషన్‌తో రాణించాడని మైఖేల్ అన్నాడు.


