తెలంగాణకు చెందిన సెయిలర్లు ధరణి లావేటి-వడ్ల మల్లేష్, దీక్షిత కొమరవెల్లి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకవల్య బాతం హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న మాన్సూన్ రెగ్గట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్ షిప్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. మరో మూడు రేసులు మాత్రమే మిగిలుండగా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ జోడీ సమీప ప్రత్యర్థులు నైన్సీ రాయ్-అనోరక్ షెండేలపై స్పష్టమైన 4 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.