MS Dhoni Birthday Special Story: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 44వ ఒడిలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ధోని బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.
అటు ఐసీసీ టైటిళ్లు.. ఇటు అవార్డులు
కెప్టెన్ కూల్ గా పిలుచుకునే ధోని జార్ఖండ్ రాజధాని రాంచీలో 1981 జులై 7వ తేదీన జన్మించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోని తన కృషితో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు. ఈ క్రమంలో అతనిని పద్మ భూషణ్, పద్మశ్రీ మరియు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు వరించాయి. ఒత్తిడిలో కూడా ప్రశాంతగా ఉండటం ఆయనకు ఉన్న ప్రత్యేక లక్షణం. అందుకే అందరూ అతడిని కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. తన అసాధారణ ఆటతో, న్యాయకత్వ నైపుణ్యాలతో టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు, ఐపీఎల్ లో సీఎస్కేకు ఐదు టైటిళ్లను అందించాడు.
2004లో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని తన అసాధారణ ఆటతీరుతో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కీపర్ గా, బ్యాటర్ గా, ఫినిషర్ గా, కెప్టెన్ గా తనదైన ముద్ర వేశాడు. క్రికెట్ లోనే కాదు బయట కూడా కూల్ గానే ఉంటాడు మహి. ఇతడు తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షి సింగ్ రావత్ ను 2010లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జీవా అనే కుమార్తె ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతంలో ధోని రైల్వే టీసీగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు బిజినెస్ లు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.
వాటి విలువ 15కోట్ల పైమాటే..
అయితే ఎంఎస్ ధోనికి కార్లు మరియు బైక్‌లంటే తెగ పిచ్చి. ఆయన దగ్గర 70 కి పైగా బైక్‌లు, 15 కార్లు ఉన్నాయి. వీటిన్నింటినీ మహి రాంచీలోని తన “కైలాసపతి” ఫామ్‌హౌస్‌లో ఉంచాడు. ధోని తరుచుగా రాంచీ రోడ్లపై బైక్‌లపై వెళ్తూ ఉంటాడు. ధోని దగ్గర ఉన్న కార్లు, బైక్స్ విలువ లెక్కస్తే రూ.15 కోట్లు పై మాటే. ఆయన దగ్గర కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్, హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్, కవాసకి నింజా H2, డుకాటి 1098, BSA గోల్డ్ స్టార్, నార్టన్ జూబ్లీ 250 వంటి బైక్స్ తోపాటు ఫెరారీ 599 GTO, రోల్స్-రాయిస్ సిల్వర్ వ్రైత్ II, మెర్సిడెస్-AMG G63, ఆడి క్యూ7, 1969 ఫోర్డ్ ముస్తాంగ్, మహీంద్రా స్కార్పియో వంటి కార్లు ఉన్నాయి.
Also Read: IND vs ENG 2nd Test Highlights- ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
రూ.1000కోట్లకుపైగా ఆస్తులు
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని ఒకరు. ఆయన నికర ఆస్తుల విలువ 1000 కోట్లకు పై మాటే. మహి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గలేదు. ప్రసుతం ధోనికి డబ్బు ఐపీఎల్ మరియు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి వస్తుంది.