టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత జట్టులో ఆడిన నలుగురు స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలని ఉందని తెలిపాడు. గతంలోని క్రికెటర్లలో ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ధోనీ సమాధానమిస్తూ.. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్‌లతో (Yuvraj Singh) కలిసి ఆడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు.
2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌నూ ధోనీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సర్ల గురించి ప్రస్తావించాడు. టీమిండిదయాలోని అందరు ఆటగాళ్లూ తమ జీవితాల్లో మ్యాచ్ విన్నర్లేనంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్ 18వ సీజన్‌లో సీఎస్కే తరఫున బ్యాటర్, వికెట్‌కీపర్‌గా ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ నుంచి ఆశించిన స్థాయి అట రావడం లేదు. దీంతో ఆయన రిటైర్ అవ్వాలనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపైనా స్పందిస్తూ తన శరీరం సహకరించేవరకు ఐపీఎల్ ఆడతానని స్పష్టం చేశాడు.