PBKS vs MI IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరివరకూ సాగిన ఉత్కంఠ పోరులో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ మినహా టాప్ ఆర్డర్ విఫలమైనా లోయర్ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్ భారీ లక్ష్యాన్ని ముంబై ముందుంచింది. అయితే తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో టార్గెట్‌ను బుమ్రా సేన సునాయసంగా ఛేదించింది.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-direction-to-officers/
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 57(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించినా.. వరుస వికెట్లతో భారీ స్కోరు అంచనాలు తలకిందులయ్యాయి. ప్రియాంశ్ ఆర్య(22), కూపర్ కనోలీ(21) పరుగులు చేశారు. అయితే చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 38(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు 200కి చేరింది. అజ్మతుల్లాకి తోడుగా విష్ణు వినోద్ (15 నాటౌట్), జేవియర్ బార్ట్‌లెట్ (18 నాటౌట్) చివరి ఓవర్లలో విలువైన పరుగులు జోడించి మంచి సహకారం అందించారు. చివరి 22 బంతుల్లో ఏకంగా 60 పరుగులు సాధించి సత్తా చాటారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు, కార్బిన్ బాష్, రాజ్ బవాకి చెరో వికెట్ దక్కింది.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/major-fire-in-hayat-nagar-furniture-shop/
201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకి స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ శుభారంభం అందించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో పవర్‌ప్లేలోనే స్కోరు బోర్డు 50 దాటింది. అయితే రికెల్టన్ ఔట్ అవ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. రోహిత్(25) పరుగులు మాత్రమే చేయగలిగాడు. నమన్‌ధీర్(9) నిరాశపరిచినా.. తిలక్ వర్మ 75(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు- నాటౌట్) డెత్ ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్ చేసి పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడు. రూథర్ ఫర్డ్(20) పరుగులు చేయగా.. విల్ జాక్స్ 25(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఒక బాల్ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి గెలుపొందారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

