Monday, March 31, 2025
HomeఆటMI vs GT: నేడు ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు..!

MI vs GT: నేడు ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు..!

ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు నేడు జరగనుంది. ముంబై ఇండియన్స్ (MI) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్, రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. తమ తొలి మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన GT, MI లు గెలుపుతో పుంజుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా కోసం ప్రత్యేకమైనది. గతంలో GT కెప్టెన్‌గా కప్ సాధించిన పాండ్యా.. ఇప్పుడు MI కి నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో GT ముంబైని ఓడించి తొలి విజయం సాధించాలని చూస్తోంది.

- Advertisement -

GT జట్టులో సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఉండగా, MI తరఫున సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విల్ జాక్స్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే, MI కి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారనుంది.

GT బ్యాటింగ్ లైనప్‌లో సాయి సుదర్శన్ ఫామ్ కీలకం కానుంది, అతను ఇటీవలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. MI విషయానికొస్తే, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, సూర్యకుమార్ యాదవ్ దూకుడు బ్యాటింగ్ జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. GT ఇక్కడ MI పై మూడు విజయాలు నమోదు చేసింది. అయితే రాత్రి మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం బౌలర్లకు కాస్త సవాలుగా మారనుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అనుకూలంగా ఉండొచ్చు. మొత్తంగా ఈ మ్యాచ్ అభిమానులకు ఉత్తేజకరమైన క్రికెట్ వినోదాన్ని అందించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News