Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలపై మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ స్పందించారు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఓటమికి ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలే ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.
క్యాచ్‌లు వదిలేస్తే దేవుడు కూడా కాపాడలేడు!: ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 243 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌లను నమన్ ధీర్ రెండుసార్లు చేజార్చడంపై కార్తీక్ స్పందించారు. “ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ.. మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు వదిలేస్తే దేవుడు కూడా కాపాడలేడు. పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సింది పోయి.. కనీసం చేతికి వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవడం దారుణం. 30 బంతుల్లో 76 పరుగులు చేసిన హెడ్, ముంబై చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.” అని మురళీ కార్తీక్ అన్నారు.
Also read-E-cigarette: ఐపీఎల్‌లో ఈ-సిగరెట్ కలకలం.. చిక్కుల్లో రియాన్ పరాగ్?
ముంబై వైఫల్యాలపై సెహ్వాగ్ విమర్శలు: మరోవైపు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ముంబై బౌలింగ్ విభాగంపై పెదవి విరిచారు. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ మైదానంలో వ్యూహాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు. పరుగులను నియంత్రించాలంటే వికెట్లు తీయడం అత్యంత ముఖ్యమని అన్నారు. పది ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం జట్టు బలహీనతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇక నుండి జరిగే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

