ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ఫైనల్లో భారత జట్టు గెలవడంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) తనదైన శైలిలో స్పందించారు. టీమిండియా విజయాన్ని గత ఎన్నికల్లో జనసేన పార్టీ(Janasena) విజయంతో పోల్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
“గెలుపునకు అదృష్టంతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఒక్క టాస్ కూడా గెలవకుండా ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచి 12 ఏళ్లకు ఐసీసీ ఛాంపియన్ షిప్ సాధించింది టీమిండియా. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా 12 ఏళ్లకు 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించింది జనసేన. ఈ రెండిటికీ ఒకే లాంటి పోలికలు.. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం” అని నాగబాబు పేర్కొన్నారు.