నల్లగొండలో నిర్వహిస్తున్న సీఎం కప్ ఫోటీలలో భాగంగా పవర్ లిఫ్టింగ్ బాలుర జూనియర్స్ విభాగంలో జిల్లాకు చెందిన దాసరి జయశీల్ కుమార్ 105 కిలోల కేటగిరీలో జిల్లాలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండలోని ఫోర్స్ ఫిట్నెస్ క్లబ్ లో నిర్వహిస్తున్న ఈ పోటీలలో చీఫ్ సెలెక్టర్లుగా ఆశ్రఫ్ అహ్మద్, గఫార్ లు వ్యవహరించారు.