Saturday, November 15, 2025
HomeఆటNandikotkuru: అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

Nandikotkuru: అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

హోరాహోరీగా తలపడ్డ వృషభరాజులు

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామంలో శ్రీశ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని అంతర్రాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొంగర నవీన్ ముఖ్య అతిథిగా హాజరై బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 13 జతలు రావటం విశేషం.

- Advertisement -

ఈ పోటీలు హోరాహోరీగా నువ్వా నేనా రీతిలో ప్రజల కేరింతల మధ్య కొనసాగాయి. విజేతలు ఇంకా తెలియాల్సి ఉంది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వడ్డే రంగస్వామి, సాలె షాలన్న, సీపీఎం రాజు ,కొంగర అయ్యన్న, గ్రానెట్ కొంగర రాజు, గోగుల నాగ శేషులు, చేపల మహేశ్వర, పి.పుల్లయ్య, పర్వతాలు, బోయ నరసింహ, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad