Monday, July 8, 2024
HomeఆటNandikotkuru: హోరా హోరీగా సాగిన అంతర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు

Nandikotkuru: హోరా హోరీగా సాగిన అంతర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు

నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో శ్రీ కాశీ చంద్రమౌళిశ్వర స్వామి తిరునాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెము పోటీలు హోరా హోరీగా సాగాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పొట్టేళ్ల పలు విభాగాల వారిగా పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీలను గ్రామ ప్రజలు ఆసక్తిగా సంతోషకరంగా తిలకించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన పొట్టేళ్ల యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News