Friday, April 11, 2025
HomeఆటNandyala: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

Nandyala: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

భాగీరథ మహర్షి జయంతి సందర్భంగా నంద్యాల మండలం బిల్లాలాపురం గ్రామంలో గత నాలుగు రోజుల నుండి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా పార్లమెంటు కోఆర్డినేటర్ అభిరుచి మధు ఈ కబడ్డీ పోటీలకు బహుమతులు అందజేసారు.

- Advertisement -

ఫైనల్ కబడ్డీ పోటీలు కాకనూర్ వర్సెస్ డోన్ నియోజకవర్గ ప్యాపిలి మధ్య ఫైనల్ పోటీలకు అభిరుచి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్యాపిలి కబడి టీంకు విజేతలు మొదటి బహుమతి బహుమతి అందజేశారు. రెండో బహుమతి కాకునూరు, మూడవ బహుమతి శ్రీరామ్ కబడ్డీ టీం, నాలుగో టీం బిల్లాలాపురం టీములకు చేజిక్కింది.

ఈ కబడ్డీ పోటీలో నిర్వాహకుడు బిల్లాలాపురం గ్రామం న్యాయవాది ఇమిడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బిల్లాలాపురం గ్రామ నాయకుడు భూమా రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ లీడర్లు ఉపేంద్ర నాథ్ రెడ్డి లక్ష్మారెడ్డి చల్లా మధు ఎర్రమల బాలముని రామ సుబ్బారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద కొట్టాల భారతీయ జనతా పార్టీ లీడర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News