Haryana: నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు గాలోటియాస్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ పోటీలలో దేశం నలుమూలల నుండి యంగ్ బాక్సర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలలో 4వ సబ్ జూనియర్ (U-15) బాలురు & బాలికల నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హర్యానా యువ బాక్సర్ల బ్రిగేడ్ అదరగొట్టింది. బాలుర, బాలికల విభాగాల్లో ఇద్దరిలోనూ అగ్రస్థానంలో నిలిచి రెండు టైటిళ్లు గెలుచుకున్నారు.
ఈ పోటీలకు స్పైస్ జెట్ ఛైర్మన్ అండ్ ఎండీ అజయ్ సింగ్, గాలోటియాస్ యూనివర్సిటీ సీఈఓ డా. ధ్రువ్ గాలోటియా, కేంద్రమంత్రి జయంత్ చౌదరి, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
Read more: https://teluguprabha.net/sports-news/indian-shuttlers-handed-tough-draw-at-worlds-championship-2025/
హర్యానా బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన చేసారని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటనలో తెలిపారు. బాలుర విభాగంలో హర్యాన టీం 4 స్వర్ణం, 2 రజతం, 6 కాంస్య పతకాలు సాధించి 47 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో రవి సిహాగ్ (49-52kg), సంచిత్ జయని (55-58kg) ఉత్తమప్రదర్శన కనబరిచారు. సర్వీసెస్ జట్టు 5 స్వర్ణం, 4 రజతం, 9 కాంస్య పతకాలు సాధించి 38 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ టీం 2 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు సాధించి 34 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
బాలికల విభాగంలో హర్యాన టీం 5 స్వర్ణం, 4 రజతం, 5 కాంస్య పతకాలు సాధించి 57 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో గరిమా (35-37kg), ప్రిన్సీ (49-52kg), సునైనా (58-61kg), జీవికా (61-64kg), రాధికా శర్మ (67-70kg) లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సర్వీసెస్ జట్టు 3 స్వర్ణం, 3 రజతం, 6 కాంస్య పతకాలు సాధించి 42 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. పంజాబ్ టీం 2 స్వర్ణం, 2 రజతం, 3 కాంస్య పతకాలు సాధించి 33 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
బాలుర విభాగంలో ఉత్తమ బాక్సర్ గా తమిళనాడు రాష్ట్రం నుండి ఓబ్రైట్ మెక్కడేస్, ఉత్తమ ఛాలెంజర్ గా సర్వీసెస్ నుండి అభిజీత్ తేహ్లాన్, బాలికల విభాగంలో ఉత్తమ బాక్సర్ గా సర్వీసెస్ నుండి తృషాణా వినాయక్ మోహితే, ఉత్తమ ఛాలెంజర్ గా కర్ణాటక రాష్ట్రం నుండి నయన యాహ్వి ప్రత్యేక అవార్డులను పొందారు. దేశ భవిష్యత్ ని చాటేలా ఈ పోటీలలో పలువురు క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు.


