Friday, January 16, 2026
HomeఆటNeeraj- Jan Zelezny: నీరజ్‌- జెలెజ్నీ మధ్య ముగిసిన కోచింగ్‌ భాగస్వామ్యం.. స్నేహం కొనసాగుతుందని వెల్లడి

Neeraj- Jan Zelezny: నీరజ్‌- జెలెజ్నీ మధ్య ముగిసిన కోచింగ్‌ భాగస్వామ్యం.. స్నేహం కొనసాగుతుందని వెల్లడి

Neeraj Chopra- Jan Zelezny: భారత జావెలిన్‌ త్రో స్టార్‌, ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా శనివారం కీలక ప్రకటన చేశారు. తన కోచ్‌, జావెలిన్‌ త్రో దిగ్గజం జాన్ జెలెజ్నీతో తన కోచింగ్‌ భాగస్వామ్యాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు గల కారణాలను స్పష్టంగా తెలపనప్పటికీ.. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ భాగస్వామ్యానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు నీరజ్‌ తెలిపాడు. 

- Advertisement -

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాన్‌ జెలెజ్నీ శిక్షణలోనే నీరజ్ తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటారు. అయినప్పటికీ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కాగా, జెలెజ్నీతో భాగస్వామ్యానికి ముగింపు పలికిన నీరజ్‌.. ఇకపై తన శిక్షణ బాధ్యతలను తానే చూసుకుంటానని వెల్లడించాడు. అయినప్పటికీ తమ మధ్య స్నేహం కొనసాగుతుందని ఇరువురూ తెలిపారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/minister-komati-reddy-emotional-over-news-circulate/

తాను చిన్నప్పటి నుంచి ఆరాధించే అథ్లెట్ కోచ్‌ జెలెజ్నీ వద్ద శిక్షణ పొందడంతో తన కల సాకారమైందని ఈ సందర్భంగా నీరజ్‌ పేర్కొన్నాడు. జాన్‌తో కలిసి పనిచేయడం వల్ల తనకు చాలా కొత్త ఆలోచనలు తెలిశాయని.. టెక్నిక్, రిథమ్, మూవ్‌మెంట్‌పై ఆయన ఆలోచించే విధానం అద్భుతమన్నాడు. తాము కలిసి పాల్గొన్న ప్రతి సెషన్‌లో చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. జాన్‌ గొప్ప జావెలిన్‌ త్రోయర్‌ మాత్రమే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని నీరజ్‌ వివరించాడు. 

నీరజ్ లాంటి అథ్లెట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని జాన్‌ జెలెజ్నీ తెలిపారు. నీరజ్‌ తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటడంలో తాను సహాయపడగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కి 12 రోజుల ముందు వెన్నునొప్పి రావడం అతని అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. ప్రస్తుతం భాగస్వామ్యానికి ముగింపు పలికినా.. తమ మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగుతుందని వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/business/post-office-rd-scheme-invest-small-get-big-how-to-build-a-20-lakh-corpus/

కాగా, భవిష్యత్తు ఆలోచనలపై నీరజ్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు. 2026లో ఏం జరగబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. నవంబర్ ప్రారంభంలోనే సన్నాహాలు మొదలుపెట్టినట్లు చెప్పాడు. ఎప్పటిలాగే, ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యమని.. త్వరలోనే మళ్లీ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 2027 వరల్డ్ ఛాంపియన్‌షిప్, 2028 ఒలింపిక్ క్రీడలే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News