భారత స్టార్ అథ్లెట్.. రెండు ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్న నీజర్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. చాలా సీక్రెట్ గా హిమానిని వివాహం చేసుకున్నాడు నీరజ్. అయితే ఈయంగ్ ప్లేయర్ ఎందుకు ఇంత సీక్రెట్ గా వివాహం చేసుకోవడంపై.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి మ్యారేజ్ గురించి వార్తలు బయటకు రాకుండా రెండు కుటుంబాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. నీరజ్ చోప్రా స్వయంగా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు ఈ సీక్రెట్ మ్యారేజ్ గురించి మీడియాలో కూడా వార్తలు రాలేదు.
జనవరి 14, 15, 16 తేదీలలో మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలతో నీరజ్- హిమానీ పెళ్లి జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లో వెడ్డింగ్ ఈవెంట్స్ నిర్వహించారు. కేవలం 40 నుంచి 50 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత నీరజ్, హిమానీ హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లారు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఈ జంట స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం రిసెప్షన్ నిర్వహించే అవకాశం ఉంది. నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హిమానీ. ఈమె ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది. ఆమె నేషనల్ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అని తెలుస్తోంది.
అయితే అసలు నీరజ్ ఎందుకు తన వివాహాన్ని అంత సీక్రెట్ గా ఉంచారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో.. అంటే ఒలింపిక మెడల్ విజయం తర్వాతం… నీరజ్ ఫలానా వాళ్లతో ప్రేమలో ఉన్నాడంటూ అనేక పుకార్లు షికారు చేశాయి. పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన తర్వాత.. నీజర్ చోప్రా, మరో ఒలింపియన్, స్టార్ ఉమెన్ షూటర్ మను బాకర్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి.
మనుతో పాటు ఆమె తల్లితో నీరజ్ చాలా క్లోజ్‌గా మాట్లాడటంతో ఈ రూమర్స్ వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని రెండు కుటుంబాలు తేల్చి చెప్పాయి. అప్పట్లో మీడియా ఇంత రచ్చ చేసింది కాబట్టి, ఈ పెళ్లి వార్తలు బయటకు రాకుండా నీరజ్, హిమానీ కుటుంబాలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారత స్టార్ అథ్లెట్ ఇంటివాడు కావడంతో.. అందరూ శుభాకాంక్షలు చెపుతున్నారు.