సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన సంకబుడ్డి అనిల్ యాదవ్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానం సాధించడంలో అనిల్ యాదవ్ ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచాడు. రాష్ట్రస్థాయి పోటీల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 25 మంది కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రాక్టీస్ మ్యాచ్ లు నిర్వహించగా అనిల్ కుమార్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో తెలంగాణ పురుషుల సీనియర్ కబడ్డీ జట్టుకు ఎంపిక అయ్యాడు.
ఒరిస్సాలో నేషనల్స్
ఈనెల 20 నుండి 23 వరకు ఒడిస్సా రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. అనిల్ యాదవ్ నిరుపేద కుటుంబానికి చెందిన సంకబుడ్డి గోపి పద్మల కుమారుడు. గోపి ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కబడ్డీ కూత అంటే కల్లూరు అనే గుర్తింపును సంకబుడ్డి అనిల్ యాదవ్ జాతీయ స్థాయిలో నిలిపాడు. జాతీయ స్థాయిలో కల్లూరుకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తోటి క్రీడాకారులు అనిల్ యాదవ్ ఎంపిక పట్ల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.