IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన మ్యాచ్ రికార్డుల వేటగా మారింది. అత్యంత ఆసక్తికరంగా పరుగుల వరద పారిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై కోల్‌కతా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి: ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించబడింది. ఒకే మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఏకంగా ఆరుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు (అర్ధశతకాలు) బాది సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు జట్ల టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు:
- ఫిన్ అలెన్: 93 పరుగులు
- అంగ్క్రిష్ రఘువంశీ: 82 పరుగులు
- కామెరూన్ గ్రీన్: 52 పరుగులు
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు:
శుభ్‌మన్ గిల్: 85 పరుగులు
జోస్ బట్లర్: 57 పరుగులు
సాయి సుదర్శన్: 53 పరుగులు
29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం: తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా అద్భుతంగా పోరాడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్‌లు హాఫ్ సెంచరీలతో చెలరేగినప్పటికీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమైంది. దీంతో కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
Also read-KKR vs GT: ఫిన్ అలెన్ విధ్వంసం.. గుజరాత్‌పై కోలక్‌తా సూపర్ విక్టరీ
బద్దలైన మరో రికార్డు: ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధికంగా 200కు పైగా (200+) టీమ్ టోటల్స్ నమోదైన సీజన్‌గా ఈ ఏడాది సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఏకంగా 52 సార్లు జట్లు 200 ప్లస్ స్కోర్లు సాధించడం విశేషం. బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్న ఈ సీజన్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తోంది.

