ఐపీఎల్(IPL 2025) 18వ సీజన్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రీషెడ్యూల్ కారణంగా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలు మారాయి. తాజాగా ఆయా మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ముల్లాన్‌పుర్, అహ్మదాబాద్‌లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించనుంది. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పుర్ ఆతిథ్యమివ్వనుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్ 2 , జూన్ బ3న జరగబోయే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన ఒక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. మే 23న బెంగళూరు వేదికగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం పడే అవకాశాలు ఉండటంతో ఈ మ్యాచ్‌ను లక్నోకు తరలించారు.