Friday, October 18, 2024
HomeఆటINDvsNZ TEST: చేతులేత్తేసిన భారత బౌలర్లు.. భారీ ఆధిక్యంలో కివీస్..

INDvsNZ TEST: చేతులేత్తేసిన భారత బౌలర్లు.. భారీ ఆధిక్యంలో కివీస్..

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టును కేవలం 46 పరుగులకే కివీస్ బౌలర్లు ఆలౌట్ చేయగా.. బ్యాటర్లు భారత బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. దీంతో ఆ జట్టు ఆధిక్యం 299 పరుగులకు చేరింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి న్యూజిలాండ్‌ 345/7 పరుగులు చేసింది. భారత సంతతి ఆటగాడు రచిన్‌ రవీంద్ర(104) సెంచరీతో దుమ్మురేపాడు. మరోవైపు టిమ్‌ సౌతీ(49) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ డ్వేన్ కాన్వే(91), విల్‌ యంగ్‌(33) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశాడు.

- Advertisement -

ఇదే ఊపులో కివీస్ బ్యాటర్లు కొనసాగితే 400 పరుగుల ఆధిక్యం లభించనుంది. దీంతో రోహిత్ సేనకు మ్యాచ్ గెలవడం కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఇప్పటికే వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల ఆటలో ఇప్పటికే రెండు రోజులు ముగిశాయి. ఇక మరో రెండు రోజులు ఆట మాత్రమే మిగిలిన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కివీస్ బౌలర్లను ఎదుర్కొని భారీ ఆధిక్యం ఛేదించడం కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచులో భారత్ విజయం సాధించడం జరగదంటున్నారు.

ఇదిలా ఉంటే అసలే పీకలోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో చేదు వార్త అందింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కాలి గాయంతో మ్యాచుకు దూరమయ్యాడు. దీంతో ఇండియా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు సెంచరీలు చేస్తే తప్పితే ఈ మ్యాచులో విజయం సాధించడం లేదా డ్రాగా ముగియడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News