Friday, May 9, 2025
HomeఆటNZ vs Pak: పాక్ ఆటగాడు తుఫాను సెంచరీ.. మూడో టీ20లో విజయం

NZ vs Pak: పాక్ ఆటగాడు తుఫాను సెంచరీ.. మూడో టీ20లో విజయం

ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం వహించిన పాకిస్థాన్(Pakistan) టీమ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించింది. దీంతో సీనియర్ ఆటగాళ్లను తప్పించి యువ ఆటగాళ్లతో న్యూజిలాండ్‌లో(NZ vs Pak) టీ20ల సిరీస్‌కు జట్టును పాక్ బోర్డు సెలెక్ట్ చేసింది.

- Advertisement -

తొలి రెండు టీ20ల్లో ఓడిపోయిన ఆ జట్టు మూడో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 19.5 ఓవర్లలో 204 పరుగులు సాధించింది. మార్క్ చాప్‌మన్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. ఇక చివర్లో డారిల్ మిచెల్ (17), కెప్టెన్ బ్రేస్‌వెల్ (31) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ (29/3), షాహీన్ షా అఫ్రిది (2/36), అబ్బాస్ అఫ్రిది (2/24), అబ్రార్ అహ్మద్ (2/43) వికెట్లు తీశారు.

ఇక భారీ లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్ జట్టు కేవలం 16 ఓవర్లలోనేఊ టార్గెట్ ఛేదించి అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ మొహమ్మద్ హారిస్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన యువ ఆటగాడు హసన్ నవాజ్ 45 బంతుల్లో 105 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా 51 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో పాక్ రేసులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News