ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20ల సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు వన్డేల్లోనూ అదే ఆటతీరు కొనసాగిస్తోంది. ఇవాళ జరిగిన తొలి వన్డేలో(NZ vs PAK) 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 344/9 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్క్ చాప్‌మెన్ 111 బంతుల్లో 132 పరుగులతో రాణించాడు. మిచెల్ 84 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇక చివర్లో మహ్మద్ అబ్బాస్ 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రౌఫ్, అకీఫ్ జావెద్ తలో 2 వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజమ్ 78 పరుగులు, అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్ (39), రిజ్వాన్ (30) పరుగులతో రాణించినా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4 వికెట్లు, జాకబ్ డఫీ 2 వికెట్లు తీశారు.