గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అయితే లక్నో బ్యాటర్లు సునాయాసంగా ఈ టార్గెట్‌ను ఛేదించారు. ముఖ్యంగా కరేబీయన్ ప్లేయర్ నికోలస్ పూరన్(Nicholas Pooran) మాత్రం ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఏకంగా 269.23 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం.
అందులోనూ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో ఐపీఎల్(IPL) చరిత్రలో 20 బంతుల్లోపే అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్‌ను పూరన్ నాలుగు సార్లు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్లు ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌లు చెరో మూడు హాఫ్ సెంచరీలతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు(145) చేసిన ఆటగాడిగా గానూ నిలిచాడు.