Saturday, November 15, 2025
HomeఆటNirmal: క్రీడలతో యువతలో సమైక్యత

Nirmal: క్రీడలతో యువతలో సమైక్యత

ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి

యువతలో ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఉపయోగపడతాయని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సిఎం కప్ క్రీడా పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు.

- Advertisement -

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ మేరకు పోటీల్లో పాల్గొనే యువతకు మహేశ్వర్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్, జిల్లా యూత్, స్పోర్ట్స్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad