Sun Risers Hyderabad: క్రికెటర్ నితీష్ రెడ్డిపై వస్తున్న రూమర్స్ పై నోరు విప్పాడు నితీష్. ప్రస్తుతం నితీష్ తనకు అయిన మోకాలి గాయం నుండి కోలుకుంటున్నాడు. మోకాలి గాయం కారణంగా ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ సిరీస్ లో తదుపరి రెండు టెస్ట్‌లకు నితీష్ కుమార్ రెడ్డి దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది.
ఈ సిరీస్ లో మొదటి రెండు టెస్ట్ లు ఆడిన నితీష్ రెడ్డి 45 పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇది ఇలా ఉంటే తెలుగు కుర్రాడు అయిన నితీష్ కుమార్ రెడ్డి 2023 ఐపీల్ సీజన్ లో అరగేంట్రం చేసాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరపున ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ గా సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2024 ఐపీఎల్ లో అతని ప్రతిభని చూసి 2025 ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ నితీష్ రెడ్డికి రూ.ఆరు కోట్లు చెల్లించింది. కానీ ఈ 2025 ఐపీఎల్ సీజన్ లో 13 మ్యాచ్‌లు ఆడి 182 పరుగులు చేసాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. 2025లో అతనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి, ఆల్ రౌండర్‌గా తనకు సరైన అవకాశాలు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నాడని, ఇకపై సన్ రైజర్స్‌ను వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్ళడానికి సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. టీం మేనేజ్ మెంట్ తనకు సహకరించట్లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చెలరేగాయి.
Readmore: https://teluguprabha.net/sports-news/rishabh-pant-teases-chahal/
ఈ ప్రచారంపై నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇలాంటి ప్రచారాలకు నేను దూరంగా ఉంటా. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నా బంధం నమ్మకం, గౌరవం అనే వాటితో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. నేనెప్పుడూ జట్టుతోనే ఉంటా అని నితీష్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశాడు.


