Sunday, December 29, 2024
HomeఆటNitish Kumar Reddy: తెలుగు తేజం నితీశ్ కుమార్ సూపర్ సెంచరీ

Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీశ్ కుమార్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అదరగొట్టాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 10 ఫోర్లు, సిక్సర్‌తో దుమ్మురేపాడు.

- Advertisement -

బ్యాడ్ లైట్ కారణంగా ఆటను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 358/9గా ఉంది. భాతర బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్‌ 50, యశస్వి జైశ్వాల్ 82, కోహ్లి 36, పంత్‌ 28, కేఎల్‌ రాహుల్‌ 24 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 3, కమిన్స్‌ 3 వికెట్లు, నాథన్‌ లైయన్‌ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News