Thursday, January 22, 2026
HomeఆటNZ vs WI: రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్.. కష్టాల్లో విండీస్!

NZ vs WI: రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్.. కష్టాల్లో విండీస్!

New Zealand Vs West Indies Highlights, 2nd Test Day 2: న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 205 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్ తన మెుదటి ఇన్నింగ్స్ 9 వికెట్లకు 278 పరుగులు చేసి 73 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కరేబియన్ జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రాండన్ కింగ్, హాడ్జ్ క్రీజులో ఉన్నారు.

- Advertisement -

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు లాథమ్, డేవిడ్ కాన్వే మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే 42 బంతుల్లో కేవలం 11 పరుగులే చేసిన లాథమ్ ను రోచ్ ఔట్ చేసి విండీస్ కు బ్రేక్ ఇచ్చాడు. మరోవైపు కాన్వే తనదైన శైలిలో బ్యాట్ ఝలిపించాడు. ఇతడికి కేన్ విలియమ్సన్ జతకలవడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో కాన్వే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 103 పరుగుల వద్ద కేన్ మామ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర కూడా కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పటి దాకా క్రీజులో నిలదొక్కుకున్న కాన్వే ను గ్రీవ్స్ ఔట్ చేయడంతో కరేబియన్ జట్టు 117 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

Also Read: Winter Olympics 2026- ఒలింపిక్స్ కు ముస్తాబవుతున్న పురాతన రోమన్ అరేనా.. దీని ప్రత్యేకత ఏంటంటే?

అయితే ఆ తర్వాత జట్టును నిలబెట్టే బాధ్యతను మిచెల్ హే తీసుకున్నాడు. ఫిలిప్స్ సహకారంతో అతడు స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఫిలిప్స్ ఔటైనా తర్వాత పౌలిక్స్ అండతో కివీస్ కు మంచి స్కోరు అందించాడు. ఈ క్రమంలో మిచెల్ 93 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. టిక్నర్ బ్యాటింగ్ కు రాకపోవడంతో ఆటముగిసే సమయానికి 74.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల కోల్పోయి 278 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో ఫిలిప్ మూడు వికెట్లు, రోచ్ రెండు వికెట్లు తీశారు. కరేబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో క్యాంప్ బెల్(44), బ్రెండన్ కింగ్(33), హోప్(47) పరుగుల చేయడంతో ఆ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది.

Also Read: IND vs SA – రెండో టీ20లోనైనా సూర్య భాయ్ ఫామ్ లోకి వస్తాడా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News