PM Modi Congratulates Team India: ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి తొమ్మిదో సారి కప్ ను అందుకుంది టీమిండియా. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతం ఛేజింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మెగా టోర్నీలో దాయాది జట్టుతో మూడు సార్లు తలపడి.. మూడింటిలోనూ విజయం సాధించింది సూర్యా సేనా. టీమిండియా గెలుపుపై ప్రధాని మోదీ మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు టీమిండియాకు అభినందనలు తెలిపారు.
ఎక్కడైనా మనదే విజయం..
‘మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగింది. యుద్ధభూమిలోనైనా గ్రౌండ్ లోనైనా ఎక్కడైనా ఫలితం ఒక్కటే. భారత్ గెలిచింది. టీమిండియా క్రికెటర్లకు అభినందనలు” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ”ఆసియా కప్ గెలిచినందుకు టీమిండియాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మన జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్యూచర్ లో కూడా మన కీర్తిని ఇలానే నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను” అంటూ ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత బృందాన్ని ప్రశంసించారు.
తెలుగోడి దెబ్బ.. పాకిస్తాన్ అబ్బా
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించగా.. ఔటయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 84 పరుగులు జోడించారు. అనంతరం ఫఖర్(46)కు సహకరించే బ్యాటర్లు లేకపోవడంతో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్లు కుల్ దీప్, అక్షర్ పటేల్, వరుణ్ విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లో 146 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read: Asia Cup Final – ఆసియా కప్ విజేతగా భారత్
అనంతరం ఛేజింగ్ కు దిగిన టీమిండియా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సత్తా చాటాడు. ఒత్తిడిని జయిస్తూ.. సంజూ, శివమ్ ధూబేల అండతో టీమిండియా కప్ ను అందించాడు తిలక్. దీంతో భారత్ మరో రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది.
,


