Friday, April 11, 2025
HomeఆటBoxing Under-17,19: బాక్సింగ్ అండర్–17, 19 బాలికల విభాగంలో APకి పతకాల పంట

Boxing Under-17,19: బాక్సింగ్ అండర్–17, 19 బాలికల విభాగంలో APకి పతకాల పంట

నేషనల్ స్కూల్ గేమ్స్ లో సత్తా చాటిన మనోళ్లు

బాక్సింగ్ అండర్–17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కి పతకాల పంట పండించిన క్రీడాకారులను అభినందించారు పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ – 17 ,19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కాంస్య పతకాలు దక్కించుకున్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు.

- Advertisement -


ఈ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీలో జరిగాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విజేతలు వీరే:
• అండర్ 19 బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్ (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 19 బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం ) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 19 బాలికల (51-54 కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 17 బాలికల (46-48 కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన ,సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ ,విశాఖపట్నం జిల్లా ) కాంస్య పతకం సాధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News