Babar Azam Breaks Rohit Sharma’s World Record: ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్(4,234) నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(4,231) పేరిట ఉన్న రికార్డును బాబర్ బద్దలుకొట్టాడు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తర్వాత స్థానాల్లో కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్(3,710) ఉన్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబర్‌కు ఉన్న ఏకైక పోటీదారు ఇంగ్లాండ్‌కు చెందిన జోస్ బట్లర్ మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అయితే స్ట్రైక్ రేట్‌లో రోహిత్ ను, సగటులో కోహ్లీని బాబర్ అధిగమించలేకపోయాడు.
ప్రోటీస్ పై గెలుపు..
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచులో ఓడిపోయిన తర్వాత రెండో మ్యాచులో పాకిస్థాన్ గెలిచి సిరీస్ ను సమం చేసింది. శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు తొమ్మిది వికెట్లు తేడాతో గెలుచుకుంది. మూడో టీ20 మ్యాచ్ ఇవాళ నవంబరు 01, శనివారం జరగనుంది.
Also Read: Women’s WC Final 2025 – రేపే ఫైనల్ పోరు.. భారత్-సౌతాఫ్రికా హైవోల్టేజ్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లుతో చెలరేగాడు. పాకిస్థాన్ వికెట్ మాత్రమే కోల్పోయి 41 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది. పాక్ స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ 71 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆసియా కప్ జట్టు నుండి బాబర్ ను తొలగించడంపై విమర్శలు ఎదుర్కొన్న పీసీబీ ఈ సిరీస్ ద్వారా జట్టులోకి తీసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో బాబర్ 18 బంతుల్లో ఒక బౌండరీ సహాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.


