Pakistani Cricketer Haider Ali Arrested in Rape case: పాకిస్తానీ క్రికెటర్ హైదర్ అలీ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అలీని మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆగస్టు 4, సోమవారం జరిగింది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కోంటున్న అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అలీ ఇంగ్లండ్ లయన్స్ తో ఆడేందుకు పాక్ ఏ జట్టు తరుపున ఇంగ్లండ్ కు వెళ్లాడు.
అక్టోబరు 2, 2000 సంవత్సరంలో పాకిస్తాన్ లోని పంజాబ్‌లో అటాక్‌లో జన్మించాడు హైదర్ అలీ. 24 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్ దేశం తరపున పలు వన్డే, టీ20 మ్యాచులు ఆడాడు. ఇతని సోదరుడు కూడా క్రికెటర్ కావడం విశేషం. అతడు రావల్పిండి రామ్స్ తరఫున ఆడుతున్నాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా..23 అక్టోబర్ 2022న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన భారత్ తో జరిగిన మ్యాచులో పాక్ తరపున బరిలోకి దిగిన అలీ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తన ఇన్సిప్రేషన్ రోహిత్ శర్మ అని పలు సందర్భాల్లో అలీ చెప్పాడు. అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. 2023లో ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ డెర్బీషైర్ తరుపున ఆడాడు. ఇతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 2023లో ఆడాడు. త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి వస్తాడని అనుకునేలోపే అతడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కోన్నాడు.
Also Read: Asia Cup 2025 – ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్న టీమిండియా స్టార్ బ్యాటర్.. బౌలర్లకు చుక్కలే..!
హైదర్ అలీ 2019 సెప్టెంబర్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలీ నవంబర్ 1, 2020న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వన్డే ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు రెండు వన్డేలు మాత్రమే ఆడిన అలీ 42 పరుగులు చేశాడు. 35 టీ20 మ్యాచులు ఆడి 124.69 స్ట్రైక్ రేట్‌తో 505 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


