రేపటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ప్రారంభంకానున్న సంగతి తెలసిందే. టీమిండియా(Team India) తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు దుబాయ్ చేరుకుంది. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీలో జట్టు సభ్యులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. అయితే ఈ జెర్సీలో టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్థాన్ పేరు ఉండటం గమనార్హం. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐసీసీ టోర్నీల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశం పేరును జెర్సీ మీద ముద్రించాలని పేర్కొంది. ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌కు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.





